Friday, November 17, 2017

గురువర్యా! గత అయిదు సంవత్సరాలుగా కొనసాగుతూ ఎంతోమందికి పద్యభిక్ష పెట్టిన మన బ్లాగు ఇక ఉండదంటే మనసుకు ఏంటో కష్టంగా ఉంది. కోరి కోరి విషం మా చేతులో పెట్టినట్టు ఉంది. మీరొక్క సారి పునరాలోచించి నిర్ణయం తీసుకొంటే మంచిది. పద్యం రాసే వాళ్ళే కరువైపోతున్న ఈ రోజుల్లో మీలాంటి వారు పూనుకోకుంటే పద్యానికి దిక్కు లేకుండా పోయేది. సమస్య ఇవ్వడం ఎంత కష్టమో దాన్ని పూరించడం కూడా అంతే కష్టం. మీరిచ్ఛే సమస్యలు మా స్వంత సమస్యలను మరిపించి, మమ్ములనెంతగానో మురిపించి, మా మెదడుకు పనిపెట్టించి, మా పనిపట్టించి చీకట్లో దివ్వెలాగా ఉపకరించింది. అటువంటి బ్లాగు కనుమరుగవడం మంచిది కాదు. కాబట్టి సమయోచిత నిర్ణయం తీసుకోగలరు. నాకంటే పెద్దవారు, పద్యాలపై ఆసక్తి ఉన్నవారు, పద్యపుంగవులు అనిపించుకొన్నవారు చూపిన దారిలో మీరు ఆలోచిస్తే బాగుంటుంది. శ్రీ నేమాని వారి సహకారం లేదని మీరు విషాద యోగం అవలంబిస్తే మా బోటి వాళ్లకు దారేది? ఎందరికో సమస్యలిఛ్చి, సమస్యలను సరిచూసుకుని, సరిచేసుకొని, సమస్యా పరిష్కారం చేసిన మీరు ఈ సమస్యను సక్రమంగానే పరిష్కరించగలరని కోరుకుంటున్నాను.

Wednesday, November 1, 2017

మా ఆవిడ
మా ఆవిడదంతా ఒక విచిత్రం
ఆమె పనులేమో అందరికి విభిన్నం
తనకు ఇష్టమైనది అందరు చేయాలి
తనకు ఇష్టమైనట్లే అందరు ఉండాలి.
తనమీద జోకులేస్తె ఆమెకు భలె కోపం
తానూ ఇతరులను ఏమన్నా సంతోషం
ప్రొద్దున్న లేచింది మొదలు తోముడే
అటూయిటూ తిరుగుతూ అంతా హడావిడే.
తానేమి వండితే అదే తినాలె
మనకేం కావాలన్నా బయటే తినాలె
ఆమాటంటే ఆమెకు చిరాకు
అవుతుంది ఇల్లంతా పరాకు.
కేజీ చక్కర పైన నీళ్లు చిలకరిస్తుంది
కేజీ వంకాయలపై నీళ్లు కుమ్మరిస్తుంది
అదే శుద్ధి అంటుంటే నమ్మాలి
మన బుద్ధికి తెలీదని పడివుండాలి.
పిల్లపై తన జులుమీ గెలవాలి
భర్తకు అధికారం లేదని తెలియాలి
పెళ్లయిన కొత్తలో చూపును వినయం
తర్వాతే బయటపడుతుంది ఆమె నైజం.
తానూ చెప్పినట్లు జరగకుంటే అంతెత్తున లేస్తుంది
మరెవ్వరూ అలా ఉండకూడదంటుంది
ఆమె తత్వంపై ఈ కవిత్వం ఒక పైత్యం
అని సర్దేస్తుంటుంది కదా అనునిత్యం.