Friday, November 17, 2017

గురువర్యా! గత అయిదు సంవత్సరాలుగా కొనసాగుతూ ఎంతోమందికి పద్యభిక్ష పెట్టిన మన బ్లాగు ఇక ఉండదంటే మనసుకు ఏంటో కష్టంగా ఉంది. కోరి కోరి విషం మా చేతులో పెట్టినట్టు ఉంది. మీరొక్క సారి పునరాలోచించి నిర్ణయం తీసుకొంటే మంచిది. పద్యం రాసే వాళ్ళే కరువైపోతున్న ఈ రోజుల్లో మీలాంటి వారు పూనుకోకుంటే పద్యానికి దిక్కు లేకుండా పోయేది. సమస్య ఇవ్వడం ఎంత కష్టమో దాన్ని పూరించడం కూడా అంతే కష్టం. మీరిచ్ఛే సమస్యలు మా స్వంత సమస్యలను మరిపించి, మమ్ములనెంతగానో మురిపించి, మా మెదడుకు పనిపెట్టించి, మా పనిపట్టించి చీకట్లో దివ్వెలాగా ఉపకరించింది. అటువంటి బ్లాగు కనుమరుగవడం మంచిది కాదు. కాబట్టి సమయోచిత నిర్ణయం తీసుకోగలరు. నాకంటే పెద్దవారు, పద్యాలపై ఆసక్తి ఉన్నవారు, పద్యపుంగవులు అనిపించుకొన్నవారు చూపిన దారిలో మీరు ఆలోచిస్తే బాగుంటుంది. శ్రీ నేమాని వారి సహకారం లేదని మీరు విషాద యోగం అవలంబిస్తే మా బోటి వాళ్లకు దారేది? ఎందరికో సమస్యలిఛ్చి, సమస్యలను సరిచూసుకుని, సరిచేసుకొని, సమస్యా పరిష్కారం చేసిన మీరు ఈ సమస్యను సక్రమంగానే పరిష్కరించగలరని కోరుకుంటున్నాను.

Wednesday, November 1, 2017

మా ఆవిడ
మా ఆవిడదంతా ఒక విచిత్రం
ఆమె పనులేమో అందరికి విభిన్నం
తనకు ఇష్టమైనది అందరు చేయాలి
తనకు ఇష్టమైనట్లే అందరు ఉండాలి.
తనమీద జోకులేస్తె ఆమెకు భలె కోపం
తానూ ఇతరులను ఏమన్నా సంతోషం
ప్రొద్దున్న లేచింది మొదలు తోముడే
అటూయిటూ తిరుగుతూ అంతా హడావిడే.
తానేమి వండితే అదే తినాలె
మనకేం కావాలన్నా బయటే తినాలె
ఆమాటంటే ఆమెకు చిరాకు
అవుతుంది ఇల్లంతా పరాకు.
కేజీ చక్కర పైన నీళ్లు చిలకరిస్తుంది
కేజీ వంకాయలపై నీళ్లు కుమ్మరిస్తుంది
అదే శుద్ధి అంటుంటే నమ్మాలి
మన బుద్ధికి తెలీదని పడివుండాలి.
పిల్లపై తన జులుమీ గెలవాలి
భర్తకు అధికారం లేదని తెలియాలి
పెళ్లయిన కొత్తలో చూపును వినయం
తర్వాతే బయటపడుతుంది ఆమె నైజం.
తానూ చెప్పినట్లు జరగకుంటే అంతెత్తున లేస్తుంది
మరెవ్వరూ అలా ఉండకూడదంటుంది
ఆమె తత్వంపై ఈ కవిత్వం ఒక పైత్యం
అని సర్దేస్తుంటుంది కదా అనునిత్యం.

Tuesday, May 16, 2017

ఆంధ్ర ప్రదేశ్ లో   రాజకీయాలు చూస్తుంటే వెగటు పుడుతోంది. ఇప్పటికే ముద్దాయిగా నిర్ధారించబడిన జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉంటూ ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అయిపోదామా అని గుంటకాడ నక్కలాగా కాచుకొని వున్నాడు. మరోవైపు చంద్రబాబు వచ్ఛే ఎన్నికల్లో తానె గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమధ్య ఇలా కాదని జగన్ ప్రధాన మంత్రిని కలిసి ఏవో సంప్రదింపులు జరిపి వచ్ఛే ఎన్నికల్లో తానూ ముఖ్యమంత్రి కావడానికి సహాయం చేయమని ప్రధాని  కోరినట్లున్నాడు. అందుకు ప్రధాని ఏమి చెప్పాడో గాని తానూ ప్రధానిని కలిసిన విషయం ఎంతో గొప్పగా చెప్పుకొంటున్నారు జగన్. ప్రధాని జగన్కు ఎం సహాయం చేస్తాడో తెలియంది గాని ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడున్న సీట్లు కూడా పోగొట్టుకోడం ఖాయమని గ్రహించే ఉంటాడని ఆశించవచ్చు. ఇకపోతే ఈడీపై ఫిర్యాదు చేయడం చూస్తే ఎలాగోలా కేసులనుండి బయటపడాలని జగన్ తాపత్రయపడుతున్నట్లుంది. అదే జరిగితే ఈ దేశంతో న్యాయ వ్యవస్థ కూడా శుద్ధ వెస్ట్.

Thursday, July 23, 2015

"గ్" రగిలించేది
"ర్" కలిగించేది
"దిల్" కదిలించేది
ఆ డ  ది !

ఇటీవల నేను విన్న కొన్ని కొత్త పద్యాలు.
తన పుత్రులు తన శత్రులు
తన పెన్షను తనకు రక్ష, తలభారంభౌ
తన యూహలె తన స్వర్గము
తన నరకమే ముసలితనము తథ్యము సుమతీ.

Sunday, February 9, 2014

అరమరయే లేక అల్లారుముద్దుగ
గరపబోయినాను బుద్ధులెన్నో, గర్విష్టియైనట్టి
నరసింహుని నే బిలిచితి
నరసింహుని బిలువ బలుకు నరకాసురుడే.